![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -300 లో..... సిరి అవమానించి పంపించడంతో సీతాకాంత్ ఒక దగ్గర ఆటో ఆపి తన మాటలు గుర్తుచేసుకుంటాడు. నేను ఎవరికి ఏ అన్యాయం చేసాను.. అందరు నన్ను ఇలా బాధపెడుతున్నారని సీతాకాంత్ బాధపడుతుంటే.. మీరు ఆ మాటలకి బాధపడకండి అంటూ రామలక్ష్మి దైర్యం చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్తారు. మరుసటిరోజు ఉదయం భద్రం దగ్గరికి ఫ్లాట్ తీసుకున్న వారు వస్తారు. ఏంటి ఇన్ని రోజులు అవుతుంది. కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చెయ్యలేదని అడుగుతారు.
వాళ్ళతో భద్రం దురుసుగా మాట్లాడతాడు. మీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటూ అందరు వెళ్తారు. వీళ్ళతో ప్రాబ్లమ్ అయ్యేలా ఉంది.. డబ్బు తీసుకొని నేను జంప్ అవ్వాలని భద్రం అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం సిరిని ఒక రామలక్ష్మి దగ్గరికి తీసుకొని వస్తుంది పెద్దావిడ. మీ గురించి చూస్తుంటే నేనే తీసుకొని వచ్చానని పెద్దావిడ అంటుంది. సిరిని చూసి రామలక్ష్మి లోపలికి తీసుకొని వెళ్లి సీతాకాంత్ ని పిలుస్తుంది. సిరిని చూసి సీతాకాంత్ ఎమోషనల్ అవుతాడు. నిన్న అంత అవమించాను.. నీకు కోపంగా లేదా అని సిరి అంటుంది. నిన్న అన్ని మాటలు అని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్.. ఏదో కారణముందని రామలక్ష్మి అనగానే.. సిరి ఎందుకు అలా మాట్లాడిందో చెప్తుంది. అమ్మ, వదిన కలిసి మిమ్మల్ని అవమానించాలనుకున్నారు.. అది నేను విన్నాను.. అమ్మ నిన్ను అవమానిస్తే నువ్వు భరించలేవు.. అందుకే అమ్మ ఏం అనకముందే నిన్ను తిట్టి పంపించానని సిరి అంటుంది. నిన్న నాకు చీర ఇస్తే తీసుకోలేదు కదా ఇప్పుడు ఇవ్వండి అనగానే ఇద్దరు సిరికి చీర పెడుతారు. ఆకలిగా ఉందని సిరి అనగానే.. రామలక్ష్మి వెళ్లి వంట చేస్తుంది.
రామలక్ష్మి కిచెన్ లోకి వెళ్లేసరికి అక్కడ సరుకులేం ఉండవు కానీ ఏదో ఒకటి చేయాలని వంట చేస్తుంది. సీతాకాంత్ వచ్చి సరుకులు లేవ్ కదా ఏం చేస్తున్నావని అంటాడు. నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వంట చేసి తీసుకొని వస్తుంది. ఇద్దరు బాగుంది అంటారు. మరొకవైపు ఈ డబ్బు మీకు.. ఇది నాకు అని భద్రం సందీప్ వాళ్ళతో అనగానే అంత డబ్బు ఎందుకని సందీప్ అడుగుతాడు. పని మొదలు పెట్టాలి కదా అంటూ తీసుకొని వెళ్తాడు. మళ్ళీ వచ్చి ఆ డబ్బు కూడా తీసుకొని వెళ్తానని భద్రం మనసులో అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి పనులు చేస్తుంటే సీతాకాంత్ హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |